
హైదరాబాద్ : ఎర్లీబర్డ్ పతకంలో భాగంగా జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు రికార్డు స్థాయిలో ఆస్తిపన్ను వసూలు చేశారు. ఏప్రిల్ నెలలో నిర్వహించిన ఎర్లీ బర్డ్ పథకంలో సర్కిల్ నుంచి 70.27 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేశారు. అధికారులు నిర్దేశించుకున్న 49.90 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి 70.27 కోట్లతో కొత్త రికార్డులను నెలకొల్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక ఆస్తిపన్ను వసూలు చేసిన శేరిలింగంపల్లి సర్కిల్ మొదటి స్థానంలో నిలిచింది.