
శేరిలింగంపల్లి : రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పేద ముస్లింలకు అందజేసే రంజాన్ కానుకలను శనివారం శేరిలింగంపల్లి డివిజిన్ లో పంపిణీ చేశారు. డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్ మజీద్ వద్ద, గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్ లో ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపించిన బట్టల గిప్ట్ బ్యాగులను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అందజేశారు. ప్రతి ముస్లిం కుటుంబం రంజాన్ పండగను సుఖ సంతోషాల మధ్య జరుపుకోవాలనే సదుద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి ఏటా రంజాన్ గిప్ట్ బ్యాగులను అందజేయడం జరుగుతుందని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. కార్యక్రమంలో బిలాల్ మజీద్ అధ్యక్షుడు బాబర్, సెక్రటరీ అజ్మత్ ఖాన్, రవి నాయక్, షేక్ సత్రూ, జాహంగీర్ బీ, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
Mr. Turley added that he views that some people who proposed the