
శేరిలింగంపల్లి : ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సోమవారం బోర్డు కార్యాలయం ముట్టడి పిలుపు నేపథ్యంలో శేరిలింగంపల్లిలో పలువురు నాయకులను ముందస్తుగా అరెస్టులు, గృహ నిర్బంధం చేశారు. బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డిని, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ను ముందస్తుగా సోమవారం ఉదయం నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. అంజయ్యనగర్ కు చెందిన బిజెపి నాయకులను రాయదుర్గం పోలీస్ స్టేషన్ కు, గోపన్ పల్లి, గౌలిదొడ్డి ననకరాంగుడకు చెందిన పలువురు నాయకులను అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు.