
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లిలో మే డే వేడుకలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించి కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నారు. చందనగర్ లో తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, బొబ్బ నవతారెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే గాంధీ ఆవిష్కరించారు. సిపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో జెండాలను ఆవిష్కరించారు.
