
హైదరాబాద్ : సామాజికంగా వెనుకబడిన శిష్టకరణ కులాన్ని కేంద్రం ఓబీసీ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం అధ్యక్షులు డీవీ కృష్ణారావు డిమాండ్ చేశారు. శిష్టకరణ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం చందానగర్ లోని శిష్టకరణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. కులాభివృద్ది, వివాహ వేదిక ,ఆదాయ వ్యయ నివేదిక ఏడాదిలో నిర్వహించిన అభివృధి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్బంగా డీవీ కృష్ణారావు మాట్లాడుతూ.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన శిష్టకరణ కులానికి ఏలాంటి కుల వృత్తి లేదన్నారు. గతంలో గ్రామ కరణాలుగా పనిచేసిన శిష్టకరణలు, కరణాల వ్యవస్థ రద్దుతో తమ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని ఆయన వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బిసీ డి లో ఉన్న తమను ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.