
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సోమవారం దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్‌ల స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 35 వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు జరపాలని పేర్కొంది.
21 ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ తరవాత ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఒక్కొక్క నియోజకవర్గం నుండి కనీసం 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా చేయడం వలన ఎన్నికల్లో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నాయి. కానీ ఆలా చేస్తే ఫలితాలు 6 రోజులు ఆలస్యంగా వెల్లడవుతాయని, గతంలో లెక్కించినట్టే ఒక్కో నియోజకవర్గం నుండి ఒక్క వీవీప్యాట్ స్లిప్పును మాత్రమే తీసుకుని లెక్కిస్తామని ఎలక్షన్ కమీషన్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్‌ల స్లిప్పులు లెక్కించాలని తీర్పు ఇచ్చింది.