
హైదరాబాద్ : నగర శివారు పరిధిలోని లింగంపల్లిలో సోమవారం రాత్రి ఓ వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకువచ్చిన వాటర్ ట్యాంకర్ లింగంపల్లి కూరగాయల మార్కెట్ వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో గోపన్ పల్లికి చెందిన యువకుడు చందు అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా ప్రమాదంపై చందనగర్ పోలీసులు సక్రమంగా స్పందించక పోవడంతో స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్నారు.
