
హైదరాబాద్ : ఆనందంగా కన్న కొడుకు పెళ్లి చేసిన తండ్రి అనుకోని రోడ్డు ప్రమాదానికి బలయ్యాడు. మణికొండలో జరిగిన రోడ్డు ప్రమాదం పెళ్లి ఇంట విషాదాన్ని నింపింది. మణికొండ పోలీసు శిక్షణా కేంద్రం ముందు బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన పెళ్లి కారు ఢీ కొట్టింది. ఈ
ప్రమాదంలో కారులో ఉన్న పెళ్లి కొడుకు తండ్రి ఆగారెడ్డి మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మృతుడు అగారెడ్డిది వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం కొప్పుల గ్రామం కాగా తన కుమారుడి పెళ్లి వేడుకల అనంతరం తిరిగి వెళ్తూ ప్రమాదంలో మృతి చెందాడు.