
హైదరాబాద్ : రెవెన్యూ అధికారుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ముఖ్యమంత్రికి లేఖ రాసి తన ముగ్గురు పిల్లలతో అదృశ్యమయ్యాడు. కాగా లేఖలో ముగ్గురు పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటానని రాయడంతో పోలీసులు యుద్ధ ప్రాతిపదికన సదరు వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. తార్నాక లో నివాసం ఉంటున్న మల్లారెడ్డి అనే వ్యక్తి సీఎం కెసిఆర్ కు లేఖ రాసి తన ముగ్గురు పిల్లల తో అదృశ్యమయ్యాడు. పెద్దపల్లి జిల్లా పగిడిపల్లి లోని తన తండ్రి నారాయణ రెడ్డి మరణించిన తరువాత వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరు మీదకు మార్చాలని అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడి VAO మరియు VRO లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు, పిల్లల చావుకు VAO , VRO లు కారణమని సీఎం కెసిఆర్ కు లేఖ రాసాడు. తన మరణాంతరం భూమి తన తల్లి కి చెందేలా చూడాలని లేఖలో ముఖ్యమంత్రి ని కోరిన మల్లారెడ్డి తన ముగ్గురు పిల్లలతో అదృశ్యమయ్యాడు.