
హైదరాబాద్ : ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ నే ఫోర్జరీ చేశారు ఈ ఘనులు. ముఖ్యమంత్రి సిఫార్సు లెటర్ తో గచ్చిబౌలిలోని 100 కోట్ల విలువైన భూమిని హస్తగతం చేసుకునేందుకు స్కెచ్ వేశారు. గచ్చిబౌలి వంటి ఖరీదైన ప్రాంతంలో ఉన్న 2 ఎకరాల స్థలం కోసం ఏకంగా ముఖ్యమంత్రి సిఫార్సు చేయడంపై అనుమానం వచ్చిన అధికారులు కూపీ లాగితే అసలు విషయం బయట పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన నిందితులు గచ్చిబౌలి సర్వే నెంబర్ 44పి లో ఉన్న 2 ఎకరాల స్థలాన్ని మ్యుటేషన్ చేయాలని నకిలీ లెటర్ సృష్టించి రాజేంద్రనగర్ ఆర్డిఓకు దరఖాస్తు చేసుకున్నారు. అనుమానం వచ్చిన ఆర్డీఓ గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేయగా మొహమ్మద్ ఉస్మాన్ ఖురేషీ, సయ్యద్ రషీద్ హుస్సేన్, అమరేంద్ర అనే నిందితులను అరెస్ట్ చేశారు.వీరిలో ఒకరు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కావడం విశేషం.

I am really impressed with the content of this blog. The in-depth explanation and facts provided really help Ligaciputra77 to understand this topic better. Thank you for your efforts in writing it