
హైదరాబాద్ : ఓ మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది. తోటి కానిస్టేబులే ఆమెను దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆర్ సీ పురం పోలీస్ స్టేషన్ లో మందాకిని (WPC 7508) మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. 29వ తేదీన డ్యూటీ దిగి ఇంటికి బయలు దేరిన మందాకిని కనిపించకుండా పోయింది. ఆమె తండ్రి 30వ తేదీన అర్ సీ పురం పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసాడు. పోలీసులు అనుమానితుడు అయిన హత్నూర పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ప్రకాష్ జెల్ల (pc1316) ను అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో మహిళ కానిస్టేబుల్ ను హత్య చేసి సదాశివపెట్ మండలం కోనపూర్ గ్రామ శివారులో పెట్రోల్ పోసి తగులపెట్టానని ఒప్పుకొని, రాత్రి 12 గంటలకు డెడ్ బాడీని చూపించాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం పఠాన్ చేరు ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. నిందితుడు ప్రకాష్ కు గతంలోనే పెళ్లి జరుగగా, మందాకిని సంవత్సరాలుగా సంబంధం కొనసాగిస్తున్నాడని సమాచారం. మందాకిని పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీయగా ఆమెను వదిలించుకోవడానికి 29వ తేదిన ప్రకాష్ తన కారులో మందాకినిని తీసుకువచ్చి సదాశివ పెట్ మండలంలోని కోనపూర్ శివారులో చంపి పెట్రోల్ పోసి తగులపెట్టాడు. నిందితున్ని అర్ సీ పురం పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

