
హైదరాబాద్: గచ్చిబౌలి టిఎన్జీవోస్ కాలనీ అక్రమాలకు అడ్డాగా మారుతోంది. తరచూ ప్రభుత్వ ఉద్యోగుల మీద కేసుల వరకు వెళుతున్న భూ వివాదాలు తాజాగా కాలనీ సెక్రెటరీ మీద దాడికి పాల్పడే వరకు వెళ్ళింది. కాలనీలోని ఓ స్థల వివాదంలో కాలనీ సంక్షేమ సంఘం కార్యదర్శి గోపాల్ మీద ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో ఓ ఎమ్మార్వో తో పాటు అతని కుమారుడు, అల్లుడు ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీరి దాడిలో తీవ్ర గాయాలపాలైన కాలనీ కార్యదర్శి గోపాల్ ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
situs judi slot online resmi slot danamon pasti aman dan terpercaya di indonesia