
హైదరాబాద్ : ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోమన్న పాపానికి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బ్యాగులో శవమై తేలింది. ఆర్.సి పురంలో నివాసం ఉండే లావణ్య (25) టిసిఎస్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. సూరారంలో నివాసం ఉండే సునీల్ కుమార్ తో ప్రేమలో పడింది. ఇద్దరు కలిసి తిరుగడంతో పాటు శారీరకంగా ఒక్కటయ్యారు. కాగా గతకొద్దిరోజులుగా పెళ్లి చేసుకోవాలని సునీల్ కుమార్ ను లావణ్య కోరుతుంది. దీంతో పథకం ప్రకారం లావణ్యను శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలోని ఓ హోటల్ కు తీసుకువెళ్లిన సునీల్ ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని బ్యాగులో కుక్కి సూరారం కాలువలో పడవేశాడు.
