
శేరిలింగంపల్లి : రాయదుర్గంలోని ఫిరంగి నాలా డి ఫిల్టింగ్ పనులను ఆదివారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పరిశీలించారు. దశాబ్దాలుగా వర్షాకాలంలో స్థానికులు ఫిరంగి నాలాతో ఇబ్బందులు పడుతున్నారు. దీనితో వేసవిలో నాలా పూడికతీత, అభివృద్ధి పనులు చేపట్టారు. పనులను పరిశీలించిన కార్పొరేటర్ సాయిబాబా వానా కాలంలోపు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు వస్తే పనుల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.