
హైదరాబాద్ : ప్రేమలో విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గంలో చోటుచేసుకుంది. బ్రతుకుదేరువు కోసం నగరానికి వలస వచ్చిన బిద్యుత్ సఖ్య తన అన్న ప్రమోద్ సఖ్య, మరో వ్యక్తి దీపక్ సఖ్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. కాగా ఈ మధ్య కాలంలో బిద్యుత్ సఖ్య ఓ గుర్తు తెలియని యువతిని ప్రేమించాడు. కాగా ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన బిద్యుత్ సఖ్య గురువారం సాయంత్రం గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.