
హైదరాబాద్ : సెల్ఫీ సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది. సెల్ఫీ కోసం నీళ్లలోకి దిగిన ఇద్దరు మరదళ్లు, బావ నీళ్లలో మునిగి చనిపోయారు. జనగామ జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు… జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ కు స్థానికంగా ఉన్న రఘునాథపల్లి మండలం జివి తండాకు చెందిన అవినాష్ తన భార్య, ఇద్దరు మరదళ్ళతో వచ్చాడు. అవినాష్, ఇద్దరు మరదళ్లు సంగీత, సుమలతలు నీళ్లలో దిగగా, అవినాష్ భార్య గట్టుపై ఉండి వీరిని వీడియో తెస్తుంది. ఇదే సమయంలో ఆడుకుంటూ కాలువ లోపలికి వెళ్లిన ముగ్గురు నీళ్లలో మునిగి చనిపోయారు. స్థానికులు ముగ్గురి మృతదేహాలను నీళ్లలో నుంచి వెలికి తీశారు.
