
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ శిక్షణను మొదటి బ్యాచ్ పూర్తి చేసుకుంది. ఈ మేరకు శిక్షణ పూర్తి చేసుకున్న 264 మంది విద్యార్థులు శనివారం సైబరాబాద్ కమిషనరేట్ లో పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. సైబరాబాద్ కమిషనర్ విసీ. సజ్జనార్ వీరికి సర్టిఫికెట్లను అందజేశారు. మైలార్ దేవపల్లి, మియాపూర్, శివరాంపల్లికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ శిక్షణ పూర్తి చేసుకున్నారు.
