
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి శేరిలింగంపల్లి టీఅర్ఎస్ నాయకులు, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కొండాపూర్ డివిజన్ నాయకులతో కలిసి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన నీలం రవీందర్ ముదిరాజ్ ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు లభిస్తుంది అని, ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విజయవంతంగా పనిచేస్తారని నీలం రవీందర్ ముదిరాజ్ తెలిపారు. కార్యక్రమంలో కుమార్, తిరుపతిరెడ్డి, నరేష్ ముదిరాజ్, సీతారాం, చిన్నా, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
2 Comments