
శేరిలింగంపల్లి : రంజాన్ పండుగ రోజు ప్రతి మైనారిటీ కుటుంబంలో కొత్తబట్టలు కట్టుకొని సంతోషంగా పండుగను జరుపుకోవలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ కానుకలు అందజేస్తున్నారని మాదాపూర్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ మజీద్ వద్ద శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరేకవుడి గాంధీతో కలిసి శనివారం ముస్లింలకు రంజాన్ కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జయరాజ్ యాదవ్, రహీం, బాబూమియా, లియకత్, సలీం, ఖాజా, అబుజర్, మియన్, ఖాసీం,మునఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.