
శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని పిజెఆర్ రోడ్డులో కొత్తగా నిర్మిస్తున్న కల్వర్టు నిర్మాణ పనులను మంగళవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నాలా విస్తరణ పనులు వేగవంతం చేయాలనీ, పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని పేర్కొన్నారు. కల్వర్టు నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభిస్తుంది అని, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి నిర్ణిత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం లోపే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.