
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు మండలం లోని రుద్రారం జాతీయ రహదారిపై దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగా ఓ వ్యక్తిని దారుణంగా కత్తితో నరికి చంపారు. అనంతరం ద్విచక్ర వాహనం పై అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడ భారీగా జనం ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా ఈ దారుణాన్ని అడ్డుకోలేకపోయారు. అంతేగాక, మరికొందరైతే ఫొటోలు, వీడియోలు తీయడం గమనార్హం. మృతుడు మహబూబ్ గా గుర్తించిన పోలీసులు.