
హైదరాబాద్ : దంపతుల పచ్చని కాపురంలో అక్రమ సంబంధం చిచ్చు పెట్టింది. భర్త కు ఉన్న అక్రమ సంబంధం విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగగా, భార్య భర్తలు ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉప్పల్ లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి…
సీవీఆర్ న్యూస్ ఛానల్ లో పనిచేస్తున్న కె.దుర్గా నాయుడు(45), లేడీస్ టైలర్ గా పనిచేస్తున్న అనిత(౩౩)లు భార్య,భర్తలు. దుర్గ నాయుడుకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండడడంతో ఇదే విషయంలో గురువారం రాత్రి ఇద్దరు గొడవ పడ్డారు. అనంతరం వారు ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు.