
హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పక్వాన్ హోటల్ ను మంగళవారం జిహెచ్ఎంసి అధికారులు సీజ్ చేశారు. గచ్చిబౌలి బయోడైవర్సిటీ చౌరస్తా వద్ద గల పక్వాన్ హోటల్ నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ కవర్లను ఉపయోగించడం, తినుబండారాల వ్యర్ధాలను డ్రైనేజీలో కలపడం, పార్కింగ్ సదుపాయం లేకపోవడం వంటి కారణాలతో పక్వాన్ హోటల్ మీద ఫిర్యాదులు అందాయి. గతంలోనే శివరేజి బోర్డు పక్వాన్ హోటల్ కు నోటీసులు జారీ చేసింది. అయినా స్పందన లేకపోవడంతో మంగళవారం శేరిలింగంపల్లి సర్కిల్ అధికారులు హోటల్ ను సీజ్ చేశారు.
