
శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని జై హింద్ ఎనక్లేవ్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తూ,ప్రజలకు మౌళిక వసతుల కల్పనకు సరైన ప్రణాళికతో ముందుకు సాగుతామని తెలిపారు.