
శేరిలింగంపల్లి : నేత్రాలను కాపాడుకోవాలని, ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ఆదివారం సురభి కాలనీ ప్రభుత్వలో మ్యాక్సి విజన్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. పేద ప్రజలకు ఉచితంగా ఇలాంటి కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంతో ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.