
హైదరాబాద్: సాంకేతిక లోపంతో మెట్రో రైల్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్ బి నగర్ – మియపూర్ దారిలో సాంకేతిక కారణాలతో మెట్రో రైల్ నిలిచిపోవడంతో ఈ దారిలో సేవలు నిలిపివేశారు. కార్యాలయాలకు, విద్యాలయాలకు వెళ్లే ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో వేచి చూస్తుండడంతో స్టేషన్లు కిక్కిరిసిపోయాయి.