
శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ, లక్ష్మీ విహార్ లలో శనివారం గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పర్యటించారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి పర్యటించిన సాయిబాబా స్థానికంగా చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని, పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాజు ముదిరాజ్, శ్రీనివాస్, విశ్వనాథ్,కాలనీ వాసులు కొండా విజయ్ కుమార్, రవీంద్ర ప్రసాద్ ధూబే పాల్గొన్నారు.
7 Comments