
శేరిలింగంపల్లి : ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఆదివారం గచ్చిబౌలి కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా నల్లగండ్లలో పర్యటించారు. స్థానికంగా పాదయాత్ర నిర్వహించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యలను స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిఅర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.