
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో గాలివాన కారణంగా కూలిన చెట్లు వాహనాలపై పడడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.
