
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి ఫలితాలను విడుదల చేసారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 59.08శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో 65 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం రాష్ట్రంలో మేడ్చల్ జిల్లాలో 76శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచారు. మెదక్ జిల్లా నుంచి కేవలం 34శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించి చివరి స్థానంలో నిలిచారు.