
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో పర్యటించిన కార్పొరేటర్ కాలనీలో అస్తవ్యస్థంగా ఉన్న డ్రైనేజీని పరిశీలించారు. డ్రైనేజీకి అవుట్ లెట్ లేకపోవడంతో మురికి కాలువ నుంచి వచ్చే నీరు ఇళ్ల మధ్యలో, ఓపెన్ స్థలంలో వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వెంటనే మురికి కాలువపై కప్పు వేయడంతో పాటు, మురికి నీటి ప్రవాహాన్ని తగ్గించి అవుట్ లెట్ ఇచ్చేలా చూస్తామని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానికులకు హామీ ఇచ్చారు. కార్పొరేటర్ తో పాటు కాలనీ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
muñeca real