
హైదరాబాద్ : టెక్కీల వార్షిక క్రీడా పోటీలు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ సాఫ్టువేర్ ఎంటర్ ప్రైజెస్(హైసియా) ఆధ్వర్యంలో కార్పోరేట్ స్పోర్ట్స్ టోర్నమెంట్ 2019 ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభించారు. హైసియా ఆధ్వర్యంలోని పలు కంపెనీలకు చెందిన 1200మంది ఉద్యోగులు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు. క్రికెట్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, ఫుట్ బాల్, కబడ్డి, సైక్లింగ్, రన్నింగ్ వంటి క్రీడలలో టెక్కీలు ఉత్సాహంగా పోటీ పడుతున్నారు.
