
హైదరాబాద్ : టీసిఎస్ సంస్థలో కాంట్రాక్టు హౌస్ కీపింగ్ కార్మికులను భారీ ఎత్తున తొలగించారు. మొత్తం 48 మందిని ఒకేసారి తొలగించడంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. గచ్చిబౌలి టీసిఎస్ సేనర్జిలో దశాబ్దాలుగా హౌస్ కీపింగ్ కార్మికులు కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్నారు. గతంలో సీఎంసీలో పనిచేసిన వీరు సీఎంసీని టీసిఎస్ టేకోవర్ చేసిన తరువాత టీసిఎస్ లో హౌస్ కీపింగ్, ఆఫీస్ బెరర్ పనులు చేస్తున్నారు. కాగా ఎటువంటి నోటీసులు, సమాచారం లేకుండా ఒకేసారి 48 మందిని తొలగించడంతో గురువారం సంస్థ ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు.