
హైదరాబాద్ : నగరంలోని హైదర్ గూడాలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ శనివారం ప్రారంభించారు. కార్పొరేటర్లు జానకీ రామరాజు, రాగం నాగేందర్ యాదవ్ లతో కలిసి ప్రారంభించిన సుజాత యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు అండగా నిలుస్తోందని, చేనేత హస్తకళలను ప్రోత్సహించాల్సిన అవసరం మనందరిపై ఎంతైనా ఉందన్నారు. చేనేత కార్మికులు మగ్గంపై నేసిన వస్త్రాలను,హస్త కళలను పరిశీలించారు.