
హైదరాబాద్ : అనుకున్నదే జరిగింది.. మరో కాంగ్రెస్ పార్టీ ఎమ్ఎల్ఏ చెయ్యికి హ్యాండిచ్చి కారెక్కాడు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సోమవారం రాత్రి టిఅర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ను కలిసి టిఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేస్తానని ప్రకటించారు.
