
శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వెస్ట్ జోన్ శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ దాసరి హరిచందన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. శేరిలింగంపల్లి ఉప కమిషనర్ వెంకన్న, కార్పోరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్ లతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమర వీరులకు నివాళులు అర్పించారు.