
శేరిలింగంపల్లి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు, శేరిలింగంపల్లి టీఅర్ఎస్ పార్టీ ముఖ్యనేత, దివంగత కొండకల్ శంకర్ గౌడ్ 50వ జయంతిని చందానగర్ గాంధీ విగ్రహం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ యువజన నాయకులు గుర్ల తిరుమలేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, మియపూర్ కార్పొరేటర్ మేక రమేష్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం శేరిలింగంపల్లిలో శంకర్ గౌడ్ చేసిన ఉద్యమాలను స్మరించుకున్నారు. రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో… కొండకల్ శంకర్ గౌడ్ జయంతిని పురస్కరించుకుని మియపూర్ లోని వివేకానంద సేవా సంగం ఆధ్వర్యంలోని అనాథ ఆశ్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర విద్యార్థి నాయకుడు రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో వాటర్ కూలర్ అందజేశారు.
