
శేరిలింగంపల్లి : అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో స్థానికులే ముందుకు కదిలారు. తమ గ్రామంలో భూగర్భ జలాలను కొల్లగొడుతున్న వాటర్ ట్యాంకర్లను గోపన్ పల్లి వాసులు అడ్డుకున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా నడుస్తున్న వందల కొద్ది వాటర్ ట్యాంకర్లతో గోపన్ పల్లి వసూలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు భారీ మోర్టార్లతో నీటిని తోడి ట్యాంకర్లలో నింపుతుండడంతో చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఇళ్ల లో ఉన్న బోర్లు ఎండిపోతున్నాయి. ఈ విషయంపై శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామస్థులు మంగళవారం రాత్రి ట్యాంకర్లను నిలిపివేసి అందోళనకు దిగారు.
