
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని గౌలిదొడ్డి కేశవ్ నగర్ ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. కేసవనగర్ లో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో గత కొంతకాలంగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో మంగళవారం రెవెన్యూ అధికారులు సదరు నిర్మాణాలను కూల్చివేశారు. అనంతరం గోపన్ పల్లిలో అక్రమ మంచి నీటి వ్యాపార ఫిల్లింగ్ కేంద్రాలను అధికారులు కూల్చివేశారు.
