
హైదరాబాద్ : కారులో పది లక్షల రూపాయల నగదు తరలిస్తూ చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అకౌంటెంట్ కొండా సందీప్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద 10 లక్షల నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం పంపకాల చిట్టాను అతని డైరీ, లాప్ టాప్ లో స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వగా, ఐటి అధికారులు విచారణ చేపడుతున్నారు.
