
హైదరాబాద్ : పరీక్షల్లో ఫెయిలైన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన గచ్చిబౌలి పరిధిలోని ఖాజాగుడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… గచ్చిబౌలి పరిధిలోని ఖాజాగుడ చిత్రపురి కాలనీలో గల రేకుల షెడ్డులో నివాసం ఉండే కోటమ్మ కుమార్తె అలేఖ్య(18) నగరంలోని బజారఘాట్లో గల గవర్నమెంట్ ఓకేషనల్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది. కాగా ఈ మధ్య విడుదలైన ఫలితాల్లో ఆలేఖ్య ఇంగ్లీష్, అకౌంట్స్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్థాపానికి గురైన అలేఖ్య బాత్ రూంలో ఉన్న హార్పిక్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం కొలుకుంటుంది.