
శేరిలింగంపల్లి : అంతర్జాతీయ తైక్వండో పోటీలకు ఎంపికైన క్రీడాకారులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అభినందించారు. ఇటీవల కొడైకెనాల్ లో నిర్వహించిన తైక్వండో పోటీల్లో శేరిలింగంపల్లికి చెందిన ఆకాష్, అక్షిత్ లు బంగారు, వెండి పతకాలు సాధించి ఇండోనేషియాలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో గాంధీని కలువగా ఎమ్మెల్యే గాంధీ వారిని అభినందించారు. అంతర్జాతీయ టోర్నీలో సత్తా చాటాలని సూచించారు.
性感娃娃