
హైదరాబాద్ : నగరంలో సోమవారం సాయంత్రం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. నగరంలోని ఎల్బీ స్టేడియం ఫ్లడ్ లైట్ టవర్ గాలివానకు కూలిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. పలు వాహనాలు ధ్వంసం కాగా రహదారిపై టవర్ కూలడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతోపాటు గాలివాన కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో సైతం హోర్డింగ్ లు, చెట్లు విరిగిపడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.