
హైదరాబాద్: జిహెచ్ఎంసి పన్నుల విభాగం అవినీతి మయం.. మరో అవినీతి టాక్స్ ఇన్ స్పెక్టర్ ను పట్టుకున్న ఏసిబి… గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కరు ఏసీబీ అధికారులకు పట్టు పడుతున్నారు. ముఖ్యంగా పన్నుల విభాగంలో అవినీతి తారాస్థాయికి చేరుకుంది. గతంలో లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన వారి జాబితాలో మరో టాక్స్ ఇన్ స్పెక్టర్ చేరాడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దక్షిణ మండలంలో పనిచేస్తున్న ట్యాక్స్ ఇన్ స్పెక్టర్ తన కార్యాలయంలో గురువారం 6000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.