
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఅర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ స్థానాలను అధికార పార్టీ కైవసం చేసుకుంది. రంగారెడ్డి నుంచి పోటీ చేసిన మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి విజయం సాధించారు. నల్గొండ నుంచి బరిలో దిగిన తేరా చిన్నపరెడ్డి, వరంగల్ నుంచి పోటీ చేసిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. పోచంపల్లి శ్రీనివాస రెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
