
హైదరాబాద్ : ఎండాకాలంలో ఎండ వేడిమికి తాళలేక పోతున్న బొటానికల్ గార్డెన్ వాకర్లకు ఉపశమనం… ఇకపై ఎండాకాలం ముగిసే వరకు బొటనికల్ గార్డెన్ గేట్లు ఉదయం 5.15 గంటలకే తెరుచుకొనున్నాయి. సోమవారం బొటనికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీని కలిశారు. వేసవిలో ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత ఉంటుండడంతో వాకర్లు ఎండకు తాళలేక పోతున్నారని, గార్డెన్ ను ఉదయం 5.15 గంటలకే తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ నరేందర్ రెడ్డితో మాట్లాడిన ఎమ్మెల్యే గాంధీ గార్డెన్ ను ఉదయం 5.15 గంటలకే తెరిచేందుకు ఒప్పించారు. వేసవి ముగిసే వరకు గార్డెన్ వేళల్లో మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు.