
హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అక్రమాలపై బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం, ఆందోళనలు తీవ్రతరం కావడంతో రీ వాల్యుయేషన్ గడువును రెండు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రీ కౌంటింగ్, సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపుకు గడువును 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పొడిగిస్తూ బోర్డు కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు.