

హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే ఓటర్లకు కావేరి ట్రావెల్స్ షాక్ ఇచ్చింది. నేడు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లనున్న 125 బస్సులను రద్దు చేసుకుంది. ముందే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు తిరిగి ఇవ్వనున్నట్లు తెలియజేసింది. కావేరి ట్రావెల్స్ యజమానుల మధ్య విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.