
శేరిలింగంపల్లి:-రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్రపురి కాలనీ LIG లో అపార్టుమెంటు పైనుంచి దూకి ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న హిందూశ్రీ (18)… తనకు వరుసకు సోదరి అయ్యే వివాహిత ఇంట్లో చెప్పకుండా ఢిల్లీ వెళ్లిపోగా, ఈ విషయాన్ని కుటుంబ సభ్యుల వద్ద హిందు శ్రీ దాచిపెట్టింది. ఈ విషయంలో హిందూశ్రీ తండ్రి మండలించడంతో శనివారం మధ్యాహ్నం హిందూశ్రీ తమ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.