
హైదరాబాద్ : ఇంట్లో నిద్రిస్తున్న అత్తా, కొడళ్లు దారుణ హత్యకు గురయ్యారు. నగరంలోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల రోషన్ కాలనీలో ఈ దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అత్తా, కోడలు తాయబ్ , సహీబ బేగంలను గుర్తు తెలియని దుండగులు అతిదారుణంగా గోడకు బాది హత్య చేసారు. ఉద్యోగుస్తుడైన ఇంటి యజమాని డ్యూటీకి వెళ్లగా ఇద్దరు మహిళలే ఇంట్లో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
